POLITICS

నంద్యాల ఉప ఎన్నికల్లో  ప్రధాన పార్టీల ప్రచారం  హోరాహోరిగా ప్రచారం సాగుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వరుసగా ఆరో రోజు  ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాపు రిజర్వేషన్ల అంశంలో ముద్రగడకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  కాపు సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు భేటీ  కానున్నారు.

భారత్, చైనా సరిహద్దు ప్రాంతం డోక్లాం వివాదం నేపథ్యంలో చైనాతో యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉండాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. ముంబయిలో జరిగిన ప్రపంచ శాంతి సదస్సులో రాందేవ్ ప్రసంగించారు.

రాష్ట్రంలో ఎటువంటి అనుభవం లేని అసమర్ధ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడంటూ జగన్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు.

తెలుగు రాష్ట్రాల్లో స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కాపు రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కాపు సంఘాల నేతలు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నేతృత్వంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు తో భేటీ కానున్నారు.

ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించే నూతన రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రగతిదాయకమని పేర్కొన్నారు.

పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవాలకు చైనా ఉప ప్రధాని వాంగ్ యాంగ్ ముఖ్య అతిధిగా హజరుకానున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

క్షిపణుల ప్రయోగంతో అమెరికాకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా మరోసారీ దాడి చేస్తామంటూ హెచ్చరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించాడు.

పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరులోని పలు చౌకదుకాణాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినియోగదారులకు అందిస్తున్న బియ్యం నాణ్యత, తూకాలను స్వయంగా పరిశీలించారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు  ఆయనలోని ప్యాక్షనిజాన్ని తెలియజేస్తున్నాయని పల్లె అన్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సుడి గాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. నిన్న గోస్పాడు మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు.