POLITICS

నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరో మైలురాయికి సిద్ధమైంది. అతితక్కువ కాలంలో ఆధునిక హంగులతో నిర్మించిన పోలీసు డీజీపీ కార్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

నేటి సాయంత్రం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలవనున్నారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వినూత్నంగా తన నిరసన తెలియజేశారు. ఇంటి ఆవరణలోనే  జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 
రాష్ట్ర వ్యాప్తంగా 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. వాడవాడలా భారత్ మాతా కీ జై అనే నినాదాలు మార్మోగాయి.

శాసనమండలి సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను మండలి డిప్యూటీ చైర్మన్ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన చక్రపాణిరెడ్డి కొద్ది రోజుల క్రితం టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

దేశ భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సరిహద్దు పొడవునా పెచ్చరిల్లుతున్న తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని తెలిపారు.

బ్రిటీష్ పాలనలో మగ్గిపోతున్న భారత దేశానికి స్వతంత్రం సంపాదించేందుకు ఎందరో మహానుభావులు తమ ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఎంతటి క్లిష్టమైన లక్ష్యమయినా సాధించే సత్తా భారతీయుల సొంతమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట పై నుంచి జాతీయ జెండాను ఎగురవేశారు.

నాటి నాయకుల స్ఫూర్తి మనకు చైతన్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో ని తారకరామ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు.

ఉగ్రమూకల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన  కుటుంబాలకు తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.

స్వాతంత్ర దినోత్సవమోక్కటే  జాతికి సంబంధించిన ఘనమైన పండుగ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ట్విట్టర్ వేదికగా  మన దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిని పవన్..

పంద్రాగస్టు వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. ఏపీలో తొలిసారి టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నారు.