వరుణుడి కరుణ కోసం టీటీడీ మ‌హాయ‌జ్ఞం..

దేశవ్యాప్తంగా వర్షాలు కురిపించేందుకు తిరుమల తిరుపతి దేవస్ధాన మ‌హాయ‌జ్ఞం చేపట్టింది. ఈనెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు 5రోజుల పాటు కరిరిస్టి యాగం నిర్వహించాలని నిర్ణయించారు. పార్వేటి మండపం దగ్గర కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించనున్నారు. అదేవిధంగా వరాహస్వామి ఆలయంలో వరుణ జపం5 రోజుల పాటు నిర్వహించనున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలనే ఈ మ‌హాయ‌జ్ఞం  చేపట్టిన్నట్లు టీటీడీ జె.ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.

YOU MAY LIKE