నాగ చైతన్య ను ఇబ్బంది పెడుతున్న సమంత..

ప్రస్తుతం సమంత నాగచైతన్యాల జంట  హాట్ న్యూస్ గా మారుతుంది. వీరికి సంబంధించి వార్తలు ఫోటోలు ఏమి వచ్చినా వెంటనే అవి మీడియాలో ఫ్లాష్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా వీరి అభిమానులు అంతా ఈ ప్రేమ జంట ఈ సంవత్సరం ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది అన్న విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దీనికితోడు సమంత ఎప్పటికప్పుడు తమ మధ్య వున్న ప్రేమ బంధాన్ని తన ఫాన్స్ తో పంచుకోవడానికి ఇష్టపడుతూ సోషల్ మీడియాలో చైతన్యతో తన మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ఒక హాబీగా పెట్టుకుంది. ఇప్పుడు ఈవిషయమే చైతూ సమంతల మధ్య చిన్న గ్యాప్ కు కారణం అవుతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
సమంత రెగ్యులర్‌ గా చైతూతో కలిసి ఉన్న విషయాలకు సంబంధించి ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నా చైతన్య మాత్రం అలాంటివి ఎక్కువగా షేర్‌ చేయడు. ''నా పర్సనల్‌ విషయాలు నా వరకే పరిమితం. కానీ సమంతకి అలాంటివి పోస్ట్‌ చేయడం ఇష్టం. నేను గుర్తించేలోపే తను తీసిన మా ఇద్దరి ఫోటోలు నెట్‌లో పెట్టేస్తూ వుంటుంది. తన ఇష్టాన్ని కాదనలేను. అలాగని నా అంతట నేనుగా అవి షేర్‌ చేయలేను'' అంటూ చైతన్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
అంతేకాదు ''మొదట్లో వాటి గురించి ఎవరైనా ప్రస్తావించినపుడు ఇబ్బందిగా వుండేది.. ఇప్పటికీ మా గురించి ఎవరు ఏమి అడిగినా నేను అంత చొరవగా మాట్లాడలేను నవ్వేసి ఊరుకుంటాను'' అంటూ చైతన్య తన పర్సనల్ ఫీలింగ్స్ ను షేర్ చేసాడు.
సమంత కోసం చైతన్య వంట చేసి పెట్టడం ఆమెతో కలిసి విదేశీ టూర్స్‌ కి వెళ్ళడానికి సంబందంచి ఈమధ్య తరుచూ లీక్ అవుతున్న తమ వ్యక్తిగత ఫోటోల పై చైతు ఈవిధంగా సమంతకు చిన్న చురకలు అంటించాడు అనుకోవాలి. అయితే ప్రేమికుడుగా సమంత కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించడమే కాకుండా సినిమాల పట్ల ఆమెకు ఉన్న అభిరుచితో వరస పెట్టి సమంత చేత సినిమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న చైతన్య సమంత ఇష్టాలను కాదనే సాహసం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడ చేయడనే అనుకోవాలి..

YOU MAY LIKE