సాఫీగా.. సాహో

బాహుబలి చిత్రంతో తన సత్తాచాటుకుంటూ హీరో ప్రభాస్ ప్రేక్షకులను ఎంతగానో అరించారు.బాహుబలి చిత్రం తరువాత బాహుబలి-2 చిత్రం విడుదలయ్యి భారి రికార్డులు సృష్టించింది.దీంతో ప్రభాస్ నేషనల్ హీరో అయ్యాడు.చాలా మంది నిర్మాతల చూపు ప్రభాస్ పై పడింది.దీంతో ప్రభాస్ తో  సినిమాలు చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ముందుకొస్తున్నారు.  కానీ ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటించనుండటంతో ఈ చిత్రం పైనే దృష్టిపెట్టారు. సాహో చిత్రంలో నటీమణులుగా తొలుత దీపికా పదుకొనే, పరిణితి చోప్రా, అమీ జాక్సన్‌ పేర్లను పరిశీలించినట్టు సమాచారం.అయితే ఆ అవకాశం కత్రినాకైఫ్‌కు దక్కింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్‌కు తగిన హీరోయిన్ కత్రినా అయితే బాగుంటుందని నిర్మాతలు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కత్రినాతో సంప్రదింపులు జరుపగా ఆమె కూడా ప్రభాస్‌తో చేయడానికి ముందుకొచ్చినట్టు తెలిసింది.అంతేకాకుండా కత్రినా డేట్స్‌ కూడా అడ్జస్ట్ కావడంతో కత్రినానే తీసుకోవాలని అనుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. కత్రినా కైఫ్ టాలీవుడ్‌కు ఎంతగానో  సుపరిచితురాలు.  తెలుగు చిత్రాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ముగ్దులుగా చేసింది . వెంకటేశ్‌తో కలిసి మల్లీశ్వరీ, బాలకృష్ణతో అల్లరి పిడుగు అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లో గ్లామర్ నటిగా పేరుతెచ్చుకొన్నది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. 

YOU MAY LIKE