స్పైడర్ గా మహేష్.....

సినీ నటుడు మహేష్ నటించిన బ్రహ్మోత్సవం చిత్రం అభిమానులను ఎంతగానో అలరించింది.మరలా అలాంటి చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తరువాత మహేష్  అభిమానులకు తీపికబురు అందింది.మహేష్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్  చిత్రం తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో సందడి నెలకొంది.చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలను చెన్త్నెలో తెరకెక్కిస్తున్నారు.
మహేష్‌ సోమవారం నుంచి యాక్షన్‌ ఘట్టాల చిత్రీకరణలో పాల్గొంటారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌ ఇంటెలిజెన్స్‌ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే బయటికొచ్చిన మహేష్‌ లుక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వాటిల్లో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ని విడుదల చేయనున్నారు. 

YOU MAY LIKE