హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్న అల్లు అర్జున్ ...

సరైనోడు చిత్రం తరువాత బన్ని మరల తన అభిమానులను  అలరించేందుకు దువ్వాడ జగన్నథంగా రానున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో  తెరకెక్కనున్న"దువ్వాడ జగన్నాథం  చిత్రం పై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఊహించని మలుపులు, అదిరిపోయే ట్విస్టులతో డీజేని అద్భుతంగా తీర్చిదిద్దితున్నాడట హరీష్ శంకర్.  అయితే, సినిమా ఫస్టాఫ్ అంతా బన్ని బ్రాహ్మాణ యువకుడి పాత్ర సందడి చేస్తూ .. సరదా సరదాగా సాగిపోతుందట. ఇంటెర్వెల్ కి ముందు ఓ బిగ్ ట్విస్ట్ తో బన్ని ఇంకో పాత్ర ఎంటర్ అవుతుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే ట్విస్ట్ అదిరిపోయేలా కనిపిస్తోంది. ఈ చిత్రం జెడ్-స్వీడుతో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ , టీజర్స్ తో 'డీజే'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేద్దామని భావించారు. మే 19న రిలీజ్ డేట్ అనుకొన్నారు. అయితే, ఇప్పుడీ డేట్ మారనున్నట్టు సమాచారమ్. మే నెలలో 'డీజే' ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అంటున్నారు. జూన్ 7వ తేదిన డీజే వచ్చే అవకాశాలున్నాయి. చిత్రం లోని కొన్ని సన్నివేశాలను బన్ని సూచనతో దర్శకుడు హరీష్ శంకర్ క్లైమాక్స్ లో మార్పులు చేస్తున్నాడని చెప్పుకొంటున్నారు. ఇది నిజమైతే.. డీజే క్లైమాక్స్ లో తేడా కొట్టిందన్న మాట నిజమే. ఇప్పటికే రిలీజైన డీజే టీజర్ కోటికి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. బన్ని సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు బ్యానర్లో ఆల్రెడీ రెండు హిట్స్ కొట్టిన బన్నీ, ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి. ఈ చిత్రం తర్వాత వంశీ దర్శకత్వలో బన్ని ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం . 

YOU MAY LIKE