LATEST NEWS

కాల్పుల కేసులో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25 వేలు విలువైన రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.

 గోర‌ఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న‌ చిన్నారుల్లో ఈ నెల‌ 10 నుంచి 11 వరకు 48 గంటల్లో 30 మంది ఆక్సిజన్ అందక మృతిచెందిన విష‌యం తెలిసిందే.

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని దారుణంగా చంపేశారు. భీమిలి మండలం టి.నగరపాలెంలో రూప అనే యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.

హైదరాబాద్ లో బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ లోని నాగర్జున స్కూల్ లో చదువుతున్న విద్యార్థి మణిందర్ ను స్కూల్ కు వెళ్తుండగా కొంతమంది దుండగులు కారులో ఎత్తుకెళ్లిపోయారు.

టీడీపీతోనే నంద్యాల అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అయ్యాలూరులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

విజయవాడలో వర్షం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

తిరుపతి పట్టణాభివృద్ధి చైర్మన్ నరసింహ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది.

నంద్యాలలో జగన్ ప్రచారం కొనసాగుతుంది. పదకొండు రోజులుగా జగన్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నంద్యాల టౌన్ హాల్ లో జరిగిన ఆర్యవైశ్యుల సమావేశంలో జగన్ పాల్గొన్నారు.

చంద్రబాబు నంద్యాలకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఉపఎన్నికల తర్వాత చంద్రబాబు తొలిసారి నంద్యాలలో పర్యటిస్తున్నారు.

నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణపై ఈసీ బదిలీ వేటు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే గోపాలకృష్ణపై వైసీపీ ఈసీకి ఫిర్యాదుచేసింది. దీంతో విచారణ చేపట్టిన ఈసీ ఆయనపై వేటు వేసింది.

అజయ్ ఆండ్ర్యూస్ డైరెక్షన్ లో మంచు మనోజ్ కథానాయకుడిగా  'ఒక్కడు మిగిలాడు' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు.

 అఖిల్ అక్కినేని హీరోగా నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది.