HEALTH & BEAUTY

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిదిలో మూడున్నర కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన వంటశాల భవనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రారంభించారు.

తెలుగుదేశం ప్రభుత్వం రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు. అనంతపురం పట్టణంలో జరిగిన విత్తన పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ నెల 26న రెండో విడత పట్టణ పేదల గృహాలకు ఉపరాష్ట్రపతి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ తెలిపారు.

VVPAT ద్వారా ఓటు ఎవరికి వేశారో కేవలం ఓటరు మాత్రమే తెలుస్తుందని కర్నూలు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యనారాయణ అన్నారు. దానిపై వచ్చే పుకార్లను ఓటర్లు నమ్మవద్దన్నారు.

నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రచార గడువు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. రెండు రోజుల నంద్యాల ప్రచారంలో భాగంగా అయ్యలూరు రోడ్ షోలో ప్రచారం నిర్వహించారు.

విజయవాడలోని గన్నవరం సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో మహిళల ఆత్మ రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

విజయవాడ పోలీస్ కమీషనరేట్ కు చెందిన కృష్ణ చెతన్య, స్విమ్మింగ్ లో తన ప్రతిభ చాటుతున్నాడు. అమెరికాలో జరగిన స్విమ్మింగ్ పోటీలలో 3 బంగారు పతకాలు, ఐదు కాంస్య పతకాలు సాధించాడు.

పదవ తరగతి విధ్యార్థిని ఆత్మహత్య ఘటన కర్నూలు పట్టణంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. స్కూలు యాజమాన్యం వలనే విద్ధార్దిని ఆత్మహత్య చేసుకుందంటూ బంధువుల ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్ సీఏ ఎన్నికలు నిబంధనలకు  విరుద్ధంగా జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేయాలంటూ మండిపడ్డారు.

ప్రజాస్వామ్యం పేరుతో వైసీపీ కుట్రలు పన్నుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ విమర్శించారు. వైసీపీ నాయకులకు ఎ ఒక్క అంశపైనా అవగాహన లేదంటూ ఎద్దెవా చేశారు.

హిందీ `బిగ్‌బాస్ 10` నుంచి హౌస్‌లోకి సామాన్యుల‌కు ప్ర‌వేశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్‌తోనే `బిగ్‌బాస్ 11` ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది.

ముఫ్పై ఆరేళ్ల చర్రితలో తొలిసారిగా షేర్లు తిరిగి కొనుగోలు చేపట్టిన దేశీయ రెండో ఐటీ దిగ్గజ సంస్థగా ఇన్ఫోసిస్ వార్తల్లో కెక్కింది. ఈ మేరకు సంస్థ నుంచి ప్రకటన వెలువడింది.