CRIME NEWS

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖ సినీ నటి ఛార్మిని నేడు సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడే ఆమె విచారణ ముగిసింది. ఆరున్నర గంటల పాటు ఆమె విచారణ కొనసాగింది. మహిళా అధికారులు ఆమెను విచారించారు.

జార్ఖండ్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాల కారణంగా 9 మంది మృతి చెందగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు.

డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారిస్తున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినీ ప్రముఖులను విచారిస్తున్న తీరు సరైంది కాదని అన్నారు.

డ్రగ్స్ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముమైత్ ఖాన్ రేపు సిట్ విచారణకు హాజరుకానుంది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ముమైత్ ఖాన్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు వినిపిస్తాయా..? మరికొంతమందికి నోటీసులు తప్పవా..? ఇప్పుడు టాలీవుడ్ ను వణికిస్తున్న ప్రశ్నలివి. హీరోయిన్ ఛార్మి సిట్ ఎదుట విచారణకు హాజరైంది.

ముంబైలో విషాదం చోటుచేసుకుంది.లాల్ బహుదూర్ శాస్త్రి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలడంతో 11 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సిట్ విచారణ ముగిసింది. తెలంగాణ సిట్ కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు చిన్నాను అధికారులు విచారించారు.

ప్రముఖ నటి చార్మి పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సిట్ విచారణలో చార్మితో పాటు న్యాయవాదిని అనుమతించేందుకు నిరాకరించింది. బలవంతంగా చార్మి రక్త నమూనాలు సేకరించరాదని ఆదేశించింది.

సిట్ విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రముఖ సినీ నటి ఛార్మీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు వింది.

తిరుమలలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. శ్రీవారి సన్నిధిలో భక్తులకు నామాలు పెట్టి జీవనం సాగించే చిరు వ్యాపారి ఏడేళ్ల కుమార్తెను ఒక మహిళ మాయమాటలు చెప్పి అపహరించింది.

డ్రగ్స్ కేసు విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. హీరోయిన్ కాజల్ మేనేజర్ ను ఇదే కేసులో అరెస్టు చేయటంతో ఈ కేసులో ప్రమేయం ఉన్నవారి సంఖ్య ఎక్కవగా ఉంటుందని తెలుస్తుంది.

డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిట్ పంపించిన నోటీసులపై హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉదయం ఆమె లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.