బాబు హామీలను నెరవేర్చారా ... ?

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సుడి గాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. నిన్న గోస్పాడు మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. టీడీపీ బలంగా ఉన్న ఈ మండలంలో వరుసగా రెండు రోజుల పాటు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు నెరవేర్చారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఓటుతో గుణపాఠం చెప్పాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.