గొప్పగా అభివృద్ధి చేస్తాను ...

ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు ఏమి అనుకున్నా... తప్పు చేశారనే విషయం పదేపదే చెప్తానని పునరుద్గాటించారు. మూడేళ్లలో ఏమి చేయలేదు కాబట్టే బాబుతో పాటు మొత్తం మంత్రులంతా నంద్యాల రోడ్లపై తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. నంద్యాల నియోజకవర్గాన్ని పులివెందుల కంటే గొప్పగా అభివృద్ధి చేస్తానన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తమకు ఓటేసే ప్రతి ఓటరును గుర్తుపెట్టుకుంటాన్నారు..
 
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా YCP అధ్యక్షుడు జగన్ పర్యటన నంద్యాలలో నాలుగోరోజు కొనసాగనుంది. 13 రోజుల పాటు నంద్యాలలో ప్రచారం నిర్వహించనున్నాడు. నాలుగో రోజు గోస్పాడు మండలంలో జగన్ పర్యటించనున్నాడు. ఈ ఉదయం మండలంలోని ఒంటెలగల నుంచి జగన్ రోడ్ షో ప్రారంభం కానుంది. శ్రీనివాసపురం మీదుగు కృష్ణాపురం వరకు జగన్ రోడ్ షో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు

YOU MAY LIKE