మహిళలపై అత్యాచారాలు ... !

తెలుగు రాష్ట్రాలలోని  మహిళలపై రోజు రోజుకు  అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఆడది  కనబడడమే చాలు  మృగాళ్లు అత్యాచారాలకు తెగబడుతున్నారు.మహిళలే కాదు  అభం శుభం తెలియని చిన్నారులు కూడా కామాందులకు బలవుతున్నారు.ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలను తెచ్చిన మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు.
గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 34 వేల 6 వందల రేప్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక లైంగిక దాడుల్లో  మధ్యప్రదేశ్‌ రాష్ట్రం  తొలి స్థానంలో ఉంది.. ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానంలో నిలవగా ..తెలంగాణ తొమ్మిదవ స్థానంలో నిలిచింది..  గత సంవత్సరంలో  ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1027 రేప్‌ కేసులు నమోదవ్వగా, తెలంగాణలో 1105 లైంగిక దాడులు నమోదయ్యినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి
దేశం మొత్తం మీద మహిళలపై జరిగిన నేరాల్లో 9.48 శాతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే చోటు చేసుకున్నాయని  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాలలో తేలింది.మహిళలపై  అత్యాచారలకు పాల్పడటం ,హత్యలు చెయ్యడం వంటి నేరాలు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున నాలుగు చొప్పున జరుగుతున్నాట్లు గణాంకాలు

YOU MAY LIKE