వరంగల్‌ నిట్ లో డ్రగ్స్‌ కల కలం..

తెలంగాణను డ్రగ్స్ భూతం వదిలిపెట్టడం లేదు. నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ ను డ్రగ్స కేసు వణికించేసింది. సినీ రంగమే కాదు. బడాబడా వ్యాపారవేత్తలు, స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడా జాఢ్యం వరంగల్ కూ పాకింది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న నిట్ లో డ్రగ్స్ దొరకడం సంచలనం రేపుతోంది. నిట్ లో ఇద్దరు ఓల్డ్ స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో నిట్ లో విద్యార్థుల గదులను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసారు. అందులో ద్విజ్, రమేష్ అనే ఇద్దరు ఓల్డ్ స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ వారు వాటిని డార్క్ నెట్ ద్వారా కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 

YOU MAY LIKE