ఇంటర్నేషనల్ కోర్టులో పాక్ కు షాక్.. కుల్ భూషణ్ జాదవ్ ఉరిపై స్టే..

అంతర్జాతీయ కోర్టులో పాకిస్థాన్ కు షాక్ తగిలింది. గూఢచర్యం ఆరోపణలపై భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ ఆర్మీకోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ ఫిర్యాదుతో ది హాగ్ లోని అంతర్జాతీయ కోర్టు విచారణ జరిపింది. 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పాక్ ఆర్మీ విధించిన మరణశిక్ష తీర్పుపై స్టే విధిస్తున్నట్టు వెల్లడిచాంరు. కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ చేస్తున్న వాదనలు సరికావని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అన్నారు.  జాదవ్ అరెస్టు భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాస్పదమైందన్నారు. అందుకే భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని వివరించారు. కేసులో పాకిస్థాన్ అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చారు. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్ భూషణ్ జాదవ్ ను కలిసే హక్కు భారత్ కు ఉందని తెలిపారు. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పారు. పాకిస్థాన్ లొ జాదవ్ ను కలిసేందుక భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ను ఆదేశించారు. 

YOU MAY LIKE