అతి వేగం..

విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి చోడవరం మార్గంలో రెండు ఆటోలు ఢీ కొట్టిన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ముందు వెళ్తున్న లారీనీ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా.... ఎదురుగా వేగంగా వస్తున్న మరో ఆటో ఢీ కొట్టింది. గాయపడిన వారిలో ఎనిమిది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మీతిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు