చల్లగా చూడమ్మ..

శ్రావణమాసం మూడో శుక్రవారం కావటంతో విజయవాడ ఇంద్రకీలాద్రీ భక్తులతో కిటకిటలాడుతోంది. మహిళలు పెద్ద ఎత్తున వ్రతాలు చేపట్టడంతో కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. సామూహిక వ్రతాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతాల మండపంలో మహిళలు పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ అర్చనలు చేసి తాంబూలాలు సమర్పించారు