విజయవాడలో భారీ భవనాలు కూల్చివేత..

దుర్గగుడి వద్ద అభివృద్ధి పనుల కోసం భారీ భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. శివాలయం మెట్ల మార్గానికి దిగువన ఉన్న భవనాలను దుర్గగుడి అభివృద్ధి పనులకోసం స్వాధీనం చేసుకున్నారు. ఆ భవనాలను జేసీబీల సాయంతో కూలగొడుతున్నారు. గతంలో ఈ ఇళ్లలో ఉన్నవారికి పరిహారం అందజేశారు. నిర్మాణాల కూల్చివేతతో సమకూరిన స్థలంలో ప్రసాదాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

YOU MAY LIKE