విశ్వ మానవ శాంతి కోసం దిగంబర పాద..

అనంతపురం:ఈవిశ్వంలో మానవులందరు ఒక్కటే సర్వమానవ సమానత్వం కోసం అందరూ పాటుపడాలి.పరమత ద్వేషం వద్దు అన్నిమతాల సారాంశం ఒక్కటే. ప్రతిమతాన్ని పరస్పరం గౌరవించుకోవాలి. నీతి నిజాయితిలే మానవునికి రక్ష..ప్రశాంతమైన వాతావరణం కోసం.. శాంతి సౌభాగ్యాలకు ప్రతిమానవుడు పాటుపడాలి. అని మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన పుష్పగిరి తీర్థ ఇంస్టిట్యూషన్ అడ్మినిట్రేషన్ ఇంచార్జ్ బర్క్ చెప్పారు. బెంగళూర్ వరకు దిగంబరంగా పాదయాత్ర సాగుతుంది...  గురువారం మండలకేంద్రమైన గార్లదిన్నెకు చేరుకున్నారు. ఈరోజు అక్కడే బసచేసి రేపు ఉదయం తమయాత్రను ప్రారంభిస్తారు.ప్రతి రోజు తెల్లవారుజామున 4గంటలకు ప్రారంభమై 7 గంటలకు యాత్ర ముగిస్తారు. ఆతర్వాత వకచల్లని ప్రదేశంలో సేద తీరుతారు. ఫిబ్రవరి 17 న ప్రారంభమైన ఈ యాత్ర జూన్ 25 న బెంగళూర్ లో  ముగుస్తుంది. ఆరోజున దేశ నలుమూలలనుండి వచ్చే దిగంబర స్వాముల ఆధ్వర్యంలో మహాకుంభ మేళా జరుగుతుందని..అనంతరం స్వాములు ఎవరిప్రాంతలకు వారు వెళతారని బర్క్ చెప్పారు.

YOU MAY LIKE