మలేరియా జ్వరాలతో మృతి ...

విజయనగరం జిల్లా మక్కువ మండలం నంద గ్రామంలో మలేరియా జ్వరాలతో ఐదుగురు మృతిచెందినట్లు వచ్చిన వార్తలపై జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ వివేక యాదవ్ ఆదేశాల మేరకు నంద గ్రామాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే రకరకాల అనారోగ్య కారణాలతో తమ వారు మరణించారే తప్ప జ్వరాలు కాదని జేసీ కి గ్రామస్తులు వివరించారు.