ఆ ఐదు నిమిషాలు మిస్ కాకూడదట..!

రచయిత విజయేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు తాను రాసిన కథలను తానే తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఈ సారి ఆయన చేసిన ప్రయత్నమే 'శ్రీవల్లీ' సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజత్ కృష్ణ,నేహా హింగే జంటగా సునీత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.సైన్టిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి ముందుగానే రావాలనీ, మొదటి 5 నిమిషాలను ఎలాంటి పరిస్థితుల్లోను మిస్ కాకూడదని నిర్మాత చెబుతున్నారు. మొదటి 5 నిమిషాలు ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి వాయిస్ ఓవర్ ఉంటుందనీ, కీలకమైన ఆ వాయిస్ ఓవర్ వినడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఇక ఈ కథ తన జీవితంలోని ఒక విషాదమైన అనుభవంలో నుంచి పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.      

 

YOU MAY LIKE