కెసిఆర్ కు అభినందనలు.. ఆంధ్రాలో ఎప్పుడో ...

         తెలంగాణా ముఖ్యమంత్రి తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటా అని అనుకుంటున్నారా అదేంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యా సంస్థలను కోరారు. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇది తెలుసుకున్న నెటిజన్లు కెసిఆర్ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరో మంచు మనోజ్ అయితే కేసీఆర్‌ను ఏకంగా ఆకాశానికెత్తేశారు. ట్విట్టర్‌లో కేసీఆర్‌పై కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. "మన మాతృభాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు" అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

      అంతే కాదు ఇదే విషయం పై ఉప రాష్ట్రపతి అయినా వెంకయ్య నాయుడు కూడా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆయన కూడా కెసిఆర్ ను అభినందించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు మాతృ భాషను తప్పనిసరి చేశాయని ఆయన తెలిపారు. పైగా ఆంధ్ర లో ఉన్న ప్రభుత్వ పెద్దలు కూడా త్వరలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

YOU MAY LIKE