వరుణ్ తేజ్ కి వరాలు..

యువ కథానాయకుల జాబితాలో వరుణ్‌తేజ్‌ ఒకరు. నటించిన చిత్రాలు తక్కువే అయినప్పుటికి తన నటనతో అభిమానులు ఆకట్టుకుంటున్నాడు.తీసిని చిత్రాలు పెద్దగా హిట్ కానప్పటికి  పలువురు నిర్మాతలు అతడితో సినిమాలు తీయడానికి ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా విడుదలైన వరుణ్‌తేజ్‌ నటించిన మిస్టర్‌ కమర్షియల్‌గా ఫ్లాప్‌ అయినప్పటికీ మంచి ఓపనింగ్స్‌ తెచ్చిపెట్టింది. వరుణ్‌పై ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని చాటింది. తాజాగా వరుణ్‌ దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫిదా అనే చిత్రంలో కథానాయకుడిగా చేస్తున్నాడు. దీనికి శేఖర్‌ కమ్ముల దర్శకుడు. కమర్షియల్‌గా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా తర్వాత వరుణ్‌ తేజ్‌తో సినిమాలు చేయడానికి పలువురు దర్శకులు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బస్టర్‌, ఇటీవలే రాధ వంటి హిట్‌ సినిమాను అందించిన బివిఎస్‌ఎన్‌. ప్రసాద్‌ తన కొత్త చిత్రాన్ని వరుణ్‌తో తీయనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. 
ఇకపోతే ఘాజీ వంటి విభిన్న చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి కూడా వరుణ్‌తో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. అయితే రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా లా కాకుండా గ్రాఫిక్స్‌ ప్రధానంగా ఉంటుందని తెలిసింది. దీనికోసం ఓ ఫిక్షన్‌ కథని తయారు చేసుకుంటున్నట్టు సమాచారం.

YOU MAY LIKE