బాధ తీరేనా ?

ఉద్దానం కిడ్నీ వ్యాధుల కారణాలు కనుగోనేందుకు హర్వర్డ్ విశ్యవిద్యాలయ నిపుణులు చర్యలు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వనం మేరకు విశాఖకు వచ్చిన నిపుణల బృందం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఉపకులపతి, కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ టి.రవిరాజ్‌తో భేటి అయ్యింది. హర్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణుల్లో డాక్టర్ వెంకట్ తెలుగు వ్యక్తే. యూనివర్సీటిలోని నెఫ్రాలజీ విభాగంలో వెంకట్ సేవలు అందిస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలోని తాగు నీరు, ఆహారం, జీవన విధానం, వాతావరణం, అధికంగా ఉండే ఖనిజాల వివరాలను సేకరించి, అధ్యయనం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నారు. త్వరలోనే మరో 150 మంది వైద్యుల బృందం ఉద్దానంలో పర్యటించనుంది.