విధ్వంసం చూడాల్సి వస్తుంది ...

క్షిపణుల ప్రయోగంతో అమెరికాకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా మరోసారీ దాడి చేస్తామంటూ హెచ్చరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించాడు. అమెరికా సమీపంలో గువామ్‌ద్వీపంపై క్షిపణి దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాలకు ఉత్తర కొరియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇలాగే బెదిరింపులకు పాల్పడితే విధ్వంసం చూడాల్సి వస్తుందని ఘాటుగా బదులిచ్చారు. ఇప్పటికే ఉత్తర కొరియా గత నెలలో రెండు బాలిస్టిక్‌క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.