శాస్త్రయుక్తంగా..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇనుపమెట్ల నిచ్చెన నిర్మాణంపై భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని TTD వెనక్కి తగ్గింది. రద్దీ సమయాల్లో వెండి వాకిలి వద్ద తోపులాటను నివారించడంతో పాటు అత్యవసర ద్వారం ఉండాలని TTD భావించింది. అయితే శ్రీవారి ప్రధాన ఆలయంలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇనుప మెట్ల నిర్మాణాన్ని TTD నిలిపేసింది. అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు