గోవిందా గోవింద

నాలుగు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో, తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. మొత్తం 33 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట కిలోమీటరు మేర క్యూలైన్ లో భక్తులు నిలిచారు. రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అధికారులు.. నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వసతి గదుల కొరతతో ఆరుబయటే భక్తులు వేచి ఉన్నారు

YOU MAY LIKE