తిరుపతిలో భారీ వర్షం..

తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు ఆటంకం కలిగింది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత తొలిసారిగా తిరుపతిలో రాష్ట్ర స్వాతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రెండు రోజులుగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో సభా వేదిక కోసం సిద్ధం చేసిన తడిసి ముద్దయ్యాయి. తిరుపతి SV  యూనివర్సిటీ ప్రాంగణం అంతా చిత్తడిగా మారింది. వేడుకలకు మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉండటంతో వర్షం తగ్గుముఖం పడితేనే ఏర్పాట్లు ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తోంది