భక్తుల రద్దీ ...

తిరుమలలో రెండు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కలియుగ దైవం వేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్ని భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటలు సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాన్ని TTD అధికారులు రద్దు చేశారు. కాలినడక భక్తులకు జారీ చేసే టోకెన్లను అధికారులు పది వేలకు కుదించారు. మరోవైపు తిరుమలలో ఈ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు