తిరుమలలో వెంకయ్యనాయుడు..

దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన వెంకయ్యకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహం వద్ద TTD EO అనిల్ సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఉదయం VIP ప్రారంభ దర్శన సమయంలో వెంకయ్య కుటుంబసమేతంగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఉపరాష్ట్రపతి పదవి నిర్వహిస్తానని స్పష్టం చేశారు