అలిపిరి లో ఆయుధాలు

తిరుపతి పుణ్యక్షేత్రంలో మరోసారి ఆయుధాలు పట్టుబడ్డాయి.  వారం రోజుల ముందు అత్యాధునికి గన్ తో పట్టుబడిన ఘటన మరవకముందే, ఈ రోజు మరోకరు తుపాకీతో పట్టుబడ్డారు. అలిపిరి వద్ద సప్తగిరి తనిఖి కేంద్రం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మహారాష్ట్ర భక్తుడి తుపాకీతో పట్టుబట్టాడు. రివాల్వర్‌తో పాటు ఆరు బుల్లెట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.