తాప్సీ కోసం..

తాప్సీ ప్రధానమైన పాత్రలో 'ఆనందో బ్రహ్మ' సినిమా తెరకెక్కుతుంది. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ లోగా ఈ నెల 14వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపితే బాగుంటుందని భావించారు.

 

 హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఈ వేడుకను ఘనంగా జరపడానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రభాస్ ను ఆహ్వానించారు. తాప్సీతో వున్న ఫ్రెండ్షిప్ కారణంగా, ఈ వేడుకకి రావడానికి ప్రభాస్ అంగీకరించాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో తనకి మరిన్ని ఛాన్సులు వస్తాయని తాప్సీ భావిస్తోంది. ఈ సినిమాపై ఆమె పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.    

YOU MAY LIKE