వేగంగా విస్తరిస్తున్న క్షయ వ్యాధి..

దేశంలో క్షయ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్టు కేంద్రం నిర్ధారించింది. ఈ వ్యాధి  కారణంగా   ప్రతి మూడునిమిషాలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి ఫగన్‌సింగ్‌కులస్థే తెలిపారు. రాజ్యసభలో ఓసభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ గణాంకాలు వివరించారు. 2016 ప్రపంచ టీబీ నివేదిక ప్రకారం 2015లో దేశ వ్యాప్తంగా 4 లక్షల 80 వేల మంది మరణించారని ఆయన తెలిపారు. వ్యాధి నివారణకు  టీబీ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్‌కేసులపై కూడా దృష్టి సారించినట్టు ఆయన ప్రకటించారు. ప్రాథమికదశలోనే నివారించడానికి వీలుగా  రాష్ట్రల పరిధిలో  క్యాన్సర్‌సంస్థల ఏర్పాటుకు ఆర్థికంగా చేయూతనందిస్తామని తెలిపారు.