తమిళనాడులో మంచి నాయకులున్నా వ్యవస్థలో మార్పు రాలేదు: రజనీ

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొద్దిరోజులుగా తన అభిమానులతో ప్రాంతాల వారీగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన శుక్రవారం తమ అభిమాన నటుడిని కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను కర్ణాటకలో 23ఏళ్లు ఉన్నాను, తమిళనాడులో 43ఏళ్లుగా నివసిస్తున్నాను. నేను కర్ణాటక వాడినైనా మీరు నన్ను స్వాగతించి నిజమైన తమిళుడిగా ఆదరించారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. తమిళనాడులో మంచి నాయకులున్నా వ్యవస్థలో మార్పు రాలేదు.’అని రజనీ అన్నారు.