ఆ టాబ్లెట్లకు దూరంగా వుండండి..

తలనొప్పి, ఒళ్లునొప్పులు వచ్చాయంటే చాలు.. మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్లు తీసుకొని మింగడం మనలో చాలామందికి అలావాటుగా మారింది. అయితే  ఓవర్ ది కౌంటర్ మందుల్లో చాలావరకు డాక్టర్ సలహా లేకుండా వేసుకోవచ్చనే చెబుతుంటారు. కాని ఏ మందులైనా డాక్టర్ సలహా లేకుండా వాడడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఓవర్ ది కౌంటర్ మందులతో పాటుగా ఇబూప్రూఫెన్, నాప్రోక్సెన్ లాంటి పెయిన్ కిల్లర్లను తరచుగా వాడటం వల్ల గుండె మీద ప్రభావం చూపే అవకాశం  మెండగా ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ మందులను ఎడా పెడా వాడటం వల్ల కాలేయం పనితీరుపై ప్రభావం పడుతుందనేది మనకు తెలిసిన సత్యం. అయితే ఈ ట్యాబ్లెట్ల వల్ల గుండెపోటు, పక్షవాతం లాంటి జబ్బుల బారిన పడే అవకాశం 10 శాతం పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. భరించలేని నొప్పి ఉన్నప్పుడు మాత్రమే పెయిన్ కిల్లర్లను వాడాలని, అయితే వాటిని  సాధ్యమైనంత దూరంగా ఉంచడమే మంచిదని చెబుతున్నారు.