స్వైన్ ఫ్లూ కలకలం..

ఓ వైపు ఉత్తరాది రాష్ట్రాలను వరద బీభత్సం వణికిస్తుండగానే మరో వైపు స్వైన్ ఫ్లూ కలకలం రేగుతోంది. Hవన్ N వన్  వైరస్ బారిన పడి గుజరాత్ లో  తాజాగా  ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గడచిన మూడు రోజుల్లో  20 మంది వరకు స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 343 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించినట్టు  ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఎనిమిది నెలల సమయంలో  రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల మందిని ఈ వ్యాధి బారి నుంచి కాపాడినట్టు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రజలకు  వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.     

YOU MAY LIKE