భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది:పరకాల

రాన్సమ్ వేర్ వన్నా క్రై వైరస్ రాష్ట్ర సచివాలయంలోని కంప్యూటర్లపై ప్రభావం చూపిందని కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు.సచివాలయంలో ఉన్న  సిస్టమ్స్‌ అన్నీ పటిష్టమైన యాంటీ వైరస్‌తో సురక్షితంగా వున్నాయని ఎవరూ ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం లో ప్రభుత్వం ముందు ఉందన్నారు.సభ్య సమాజం అసహించుకునే విధంగా సోషల్ మీడియా లో చిత్రాలు, భాషతో పేరుతో వాడుకోవడం సబబేనాని  ప్రతిపక్షానికి పరకాల ప్రభాకర్  ప్రశ్నించారు. జస్టిస్ కట్టూ సోషల్ మీడియా అరెస్టులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నారు. రవికిరణ్ పై 2014లో వైసీపీ కార్యకర్తలు నమోదు చేసిన కేసు వివరాలను మీడియా ముందు వెల్లడించారు.

YOU MAY LIKE