హత్య పై పలు అనుమానాలు

                తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఇంటర్ విద్యార్ధిని చాందినీ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. అందరూ భావించినట్టే  నమ్మినవారే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాలేజ్ లో పరిచయమై ప్రియుడిగా మారిన సాయి కిరణ్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలకు తోడు చాందిని కాల్ లిస్ట్ ను పరిశీలించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపి అసలు నిందితుడిని పట్టుకున్నారు.  పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంఘటనా స్థలానికి సాయి కిరణ్ ను తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.  

చాందిని జైన్ ను క్షణికావేశంలో హత్య చేసినట్లు ప్రియుడు సాయికిరణ్ అంగీకరించారు. చాందిని  తాను  రెండేళ్లగా ప్రేమించుకుంటున్నామని ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆరు నెలల నుంచి దూరంగా ఉంటున్నట్టు  పోలీసులకు వివరించాడు. చాందిని రమ్మని చెబితేనే ఇంటి నుంచి బయటకు వచ్చానని పెళ్లి విషయంలో ఇరువురి మధ్య వివాదం రేగడంతో క్షణికావేశంలో హత్య చేసినట్టు అంగీకరించారు.

సాయి కిరణ్ చెబుతున్న వివరాలపై చాందిని తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు పథకం ప్రకారమే తమ కూతురిని హత్య చేశాడంటూ ఆరోపిస్తున్నారు.  తమ కూతురి హత్య విషయంలో సాయి కిరణ్ తో పాటు ఇతరుల హస్తం కూడా ఉందంటూ ఆరోపిస్తున్నారు. పారిపోయేందుకు అవకాశం ఉన్న చోట సాయి కిరణ్ ఒక్కడే ఎలా చంపాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరపాలంటూ కోరుతున్నారు. 

 

YOU MAY LIKE