సరి చేసుకుంటాం..

తెలుగు సినీ ఇండస్ట్రీ లో డగ్స్ వాడకం ఉంటే తప్పకుండా సరి చేసుకుంటామని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. స్కూల్ పిల్లలకు డగ్స్ చేరకుండా, ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. మత్తు మందుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో తెలుగు సినీ పరిశ్రమ ముందుంటుందని తెలిపారు