వాడ వాడలా సుందరయ్య 32వ వర్ధంతి..

సీపీఎం సెంట్రల్ సిటీ ఆద్వర్యంలో నగరవ్యాప్తంగా 68 సెంటర్లలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.

వివిధ డివిజన్లలో జరిగిన కార్యక్రమాలలో రాష్ట్ర ,జిల్లా,నగర నాయకులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సుందరయ్య చిన్నతనం నుండీ అభ్యుదయ భావాలు కల్గి కుల వివక్షత కు ,పేదరికానికి వ్యతిరేకంగా కృషిచేసారని అన్నారు. దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత గా పార్లమెంట్ లో మొట్టమొదటి  ప్రతిపక్ష నాయకుడిగా ,సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారని ,విలువలతో కూడిన రాజకీయాలను ఆచరించి చూపారని ,ఆయన జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసారని కొనియాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ,సీ ఆర్ డీ ఎ కన్వీనర్ సీ హెచ్ బాబూరావు మాట్లాడుతూ సుందరయ్య నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వీర తెలంగాణ విప్లవ పోరాటం లో పాల్గొని నాయకత్వం వహించారు.అటు ప్రజా ఉద్యమాల్లో ఇటు పార్లమెంటరీ రంగంలోనూ ఆయనకు ఆయనే సాటి అన్నారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబర ,నిస్వార్థ నేతగా ఆదర్శ వంతమైన జీవితం గడిపారు.ప్రస్తుత ప్రభుత్వాలు అధికారం మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకు, సంపన్నులకు అనుకూల పాలన గా మార్చేసారు.ప్రజల కష్టాలు గాలికి వదిలేసారని  ప్రజల పక్షాన నిలబడి పోరాడేది సీపీఎం ,కమ్యూనిస్టులేనని సుందరయ్య స్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అన్నారు.వివిధ సెంటరులలో జరిగిన కార్యక్రమాలలో సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్సీహెచ్ శ్రీనివాస్ ,కే శ్రీదేవి ,జిల్లా కమిటీ సభ్యులు జి. విజయ్ ప్రకాష్ ,ఎ.వెంకటేశ్వర రావు ,సెంట్రల్ సిటీ కార్యదర్శి డీ విష్ణు వర్ధన్ ,కార్యదర్శివర్గ సభ్యులు భూపతి రమణ ,కే దుర్గారావు ,పీ మాధవ ,పీ సాంబి రెడ్డి తదితరులు పాల్గొనగా పది సెంటర్లలో చలివేంద్రాలు ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేసారు..అన్ని సెంటర్లలో సుమారు రెండు వేల మంది అభిమానులు పాల్గొన్నారు.

YOU MAY LIKE