బంజారాహిల్స్‌లో అంగ‌రంగ వైభ‌వంగా సాగుతున్న శ్రీ రామ‌ మ‌హా య‌జ్ఞం

శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన వ‌సంత న‌వ‌రాత్రి వేడుక‌ల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వేమిరెడ్డిఎన్‌క్లేవ్ కాల‌నీలో శ్రీ రామ మ‌హా య‌జ్ఞం అంగ‌రంగ వైభ‌వంగా సాగుతోంది.ఉగాది నాడు ప్రారంభమైన ఈ రామాయ‌ణ మహా క్ర‌తువులో రెండో రోజున శ్రీ రామాయ‌ణంలోని బాల‌కాండ పారాయ‌ణం ఆస‌క్తిక‌రంగా సాగింది.అంత‌కుముందు యాగ‌శాల ప్ర‌వేశం,అగ్ని ప్ర‌తిష్ట‌,మ‌హా కుంభస్థాప‌న‌,రామాయ‌ణ హోమం,ఆవాహిత దేవ‌తా మూల మంత్రాల‌తో హోమం నిర్వహించారు.విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం,శ్రీ రామ అష్టోత్త‌ర తుల‌సీ అర్చ‌న త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ముఖ వేద పండితులు శ్రీ యాద‌గిరి ఆచార్యులు నిర్వ‌హిస్తున్నారు.ఈ రామాయ‌ణ మ‌హా య‌జ్ఞం ఏప్రిల్ 5వ తేదీ దాకా కొన‌సాగుతుంద‌ని నిర్వాహ‌కులు  ప‌రాంకుశం వెంక‌టాచార్యులు తెలిపారు.

YOU MAY LIKE