లింగంపై శ్వేతనాగు...

శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలంలోని ఆనంద ఆశ్రమంలో అద్భుతం జరిగింది. అక్కడ ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన శ్వేతనాగు కొన్ని గంటలపాటు స్పటిక లింగంపై అలాగే ఉండిపోయింది. శ్రావణమాసం వేడుకల్లో భాగంగా భక్తులు పూజలు చేస్తుండగా వచ్చిన నాగుపాము లింగం పైభాగంలో పగడ విప్పి కూర్చుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి నాగుపాముకు పూజలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతమంది వచ్చినా పాము భయపడకుండా, కదలకుండా అలాగే ఉంది. సుమారు నాలుగు గంటలపాటు అలాగే ఉండి తర్వాత వెళ్లిపోయింది. శ్వేతనాగు రావడం, అలా స్పటిక లింగంపై నాలుగు గంటలపాటు ఉండడం శివమహత్యమేనని, శుభసూచకమని భక్తులు భావించారు. శ్రావణమాసం రెండో రోజైన మంగళవారం ఈ వింత జరగడం స్థానికంగా సంచలనం కలిగించింది.