నాజూకైన చేతుల కోసం..

చేతులు మృదువుగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకునే ఒక చిన్న చిట్కా ఉంది. దాన్ని తయారుచేసి చేతులకు రాసుకుంటే అవి చూడడానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మరెంతో నాజూగ్గా కనిపిస్తాయి. అదెలాగంటే... కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం: 1 టీస్పూను టొమాటో రసం: 1 టీస్పూను గ్లిజరిన్‌: కొద్దిగా నిమ్మరసం, టొమాటోరసం రెండింటినీ సమపాళ్లల్లో తీసుకొని దాంట్లో కొద్దిగా గ్లిజరిన్‌ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. అలా తయారుచేసిన ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని పదినిమిషాలు సున్నితంగా మసాజ్‌ చేసుకోవాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో చేతులను కడిగేసుకోవాలి. ఇలా 10-15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మీ చేతులు ఎంతో నాజూగ్గా తయారవుతాయి.
 

YOU MAY LIKE