షింజో అబే కు మోదీ ఆత్మీయ స్వాగతం ... !

రెండు రోజల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబే భారత్ వచ్చారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న షింజో అబే దంపతులకు ప్రధాని మోధీ ఆత్మీయ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇరుదేశాల ప్రధానులు రోడ్ షోలో పాల్గొన్నారు. జపాన్ ప్రధాని షింజో అబే రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానశ్రయానికి అబే దంపతులు చేరుకున్నారు. వీరికి ప్రధాని మోదీ గ్రాండ్ వెల్ కమ్ తెలిపారు. అనంతరం ఇరు ప్రధానులు రోడ్ షోలో పాల్గొన్నారు. షింజో అబే దంపతులు రోడ్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  అచ్చం మోధీ లాగే కుర్తా పైజామాతో షింజో అబే కనిపించగా.. విమానాశ్రయం వరకు పాశ్చాత్య దుస్తుల్లో వచ్చిన షింజో భార్య.. రోడ్ షోలో చుడిదార్ తో  అందరిని  దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. రోడ్ షో  అనంతరం సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి, మహాత్మా గాంధీకి సంబంధించిన విశేషాలను మోదీ వివరించారు. సబర్మతీ నదీ తీరాన ఏర్పాటు చేసిన వేదికపై పలువురు కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు.  అబే దంపతులు రోడ్‌ షోలో పూర్తిగా భారతీయ శైలిలో వస్త్రాలను ధరించి, కనువిందు చేశారు. అబే దంపతులను మోదీ 16వ శతాబ్దంనాటి సీదీ సయ్యద్ ని జాలీ మశీదుకు తీసుకెళ్ళారు. 

YOU MAY LIKE