షూటింగ్ కి వెళ్లిన అమ్మాయి మిస్సింగ్ !!

హైదరాబాద్ కు చెందిన షణ్ముక ప్రియ అనే యువతి పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో అదృశ్యమైంది. యాడ్ ఫిల్మ్ దర్మకుల దగ్గర అసిస్టెంట్ గా  షణ్ముక ప్రియ  ఆగస్టు 17న శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కోల్ కతా చేరుకుంది. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన షణ్ముక ప్రియ ఆగస్టు 28న ఇంటికి  వస్తానంటూ తెలిపింది.  తరువాత ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడంతో తల్లిదండ్రులే ఫోన్ చేశారు.  ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో ఈ నెల ఒకటవ తేది వరకు వేచి చూశారు. యాడ్ ఫిల్మ్ దర్శకులను అడిగినా సరైన సమాచారం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు.  

YOU MAY LIKE