సావిత్రి బయోపిక్‍లో షాలిని?

మహానటి సావిత్రి జీవితమాధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కీర్తీ సురేష్ సావిత్రిగా కనిపించబోతుంటే సమంత ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రంలో మరో హీరోయిన్ నటించబోతోందట. ఇటీవల వివాదాల మధ్య విడుదలై సంచలన విజయం అందుకుంది "అర్జున్ రెడ్డి" సినిమా. ఈ చిత్ర హీరోయిన్ షాలినీ పాండే ఇప్పుడు సావిత్రి బయోపిక్‍లో కనిపించబోతోందన్నది టాలీవుడ్ టాక్. "అర్జున్ రెడ్డి" షాలినీ నటన నచ్చడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ కీలక పాత్రకు షాలినీని అడిగాడట. ఇప్పటికే జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వైజయంతి మూవీస్ బ్యానర్‍‍పై తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018లో విడుదలకు సిద్ధమౌతోంది.

YOU MAY LIKE