షాలినీ పాండేకు అస్వస్ధత

ఇటీవల సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ షాలినీ పాండే అస్వస్ధతకు గురయ్యారు. నెల్లూరు జిల్లా లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అమెకు జ్వరం ,తలనొప్పి రావడంతో  స్ధానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం షాలిని  ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది.  తమకు  తెలియకుండా వెనక గేటు నుంచి షాలినీని పంపడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అయితే ఈ ఘటనపై షాలినీ పాండే తన ఫేస్బుక్ లో తనకు ఏమి కాలేదని తాను బాగానే ఉన్నానని అభిమానులు కంగారు పడవద్దని తెలిపింది. పైగా తన భవిష్యత్తు సినిమాల గురుంచి కూడా అభిమానులతో పంచుకున్నారు.  

YOU MAY LIKE