శ్రీ సీతారాముల క‌ళ్యాణం చూత‌ము రారండి..

×

Error message

  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).

 

శ్రీ  సీతారాముల క‌ళ్యాణ వేడుక‌ల‌కు తెలంగాణ‌లోని అతిపెద్ద రామాల‌యమైన భ‌ద్రాద్రి  శ్రీ సీత‌రామ‌చంద్ర‌స్వామి దేవాల‌యం ముస్తాబైంది.  ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

మార్చి 29 నుంచి ఎప్రిల్ 11 వ‌ర‌కు ఈ బ్ర‌హోత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్దం చేశారు. ఇందులో భాగంగా బుధ‌వారం ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రామ‌య్య‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. సుప్ర‌భాతం ప‌లికి ఆరాధ‌న నిర్వ‌హించి అభిషేక తిరుమంజ‌నం చేశారు.

 

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచల మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

 

ఉత్సవంలో విశేషాలు

 

శ్రీ‌రామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకొని ఎప్రిల్ 5న భ‌ద్రాద్రి శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి వారి క‌ళ్యాణం, మ‌రుస‌టి రోజున ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మాలు ఉంటాయి. మార్చి 29 నుంచి ఎప్రిల్ 11 వ‌ర‌కు  జ‌రిగే ఈ బ్ర‌హోత్స‌వాల‌లో ఈ కింది ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.

 

29న : ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా స్వామివారి తిరువీధిసేవ‌.

ఎప్రిల్ 1న‌: అంకురార్ప‌ణం

2న‌: ధ‌్వ‌జ‌పాట భ‌ద్ర‌క మడ‌ల లేఖ‌నం, తిరువీధిసేవ‌.

3న‌: అగ్నిప్ర‌తిష్ట‌, ధ్వ‌జారోహ‌ణం.

4న‌: చ‌తుష్టార్చ‌న‌, ఎదురుకోళ్లు.

5న: శ్రీ‌రామ‌న‌వ‌మి క‌ళ్యాణం, శ్రీ‌రామ దీక్ష ప్రారంభం

6న: మ‌హా ప‌ట్టాభిషేకం.

7న‌: స‌ద‌స్యం, హ‌ంస‌వాహ‌న సేవ‌ 

8న‌: తెప్పొత్స‌వం, అశ్వ‌వాహ‌న‌సేవ‌.

9న‌: ఉంజ‌ల్ ఉత్స‌వం, సింహ‌వాన సేవ‌.

10న: వ‌సంతోత్స‌వం, హావ‌నం, గ‌జ‌వాహ‌న సేవ‌.

11న‌: చ‌క్ర‌తీర్థం, పూర్ణాహుతి.

బ్ర‌హ్మోత్స‌వం సంద‌ర్భంగా ఇత‌ర సేవ‌లు ఇక్క‌డ అందుబాటులో ఉండ‌వు.

 

ఉత్స‌వంలో ఇలా..

* ఆలయ పండితులచే సీతారాముల కల్యాణం నిర్వ‌హించ‌బ‌డుతుంది. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల‌ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

* బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.

* ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.

* చాలా మంది ఉత్స‌వాల సంద‌ర్భంగా ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.

* దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధిస్తారు.

* భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు.

* ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

 

YOU MAY LIKE