'శశికళ అవుట్' ... !!

అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మ శశికళను తొలగిస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. చెన్నైలోని పార్టీ సర్వ సభ్య సమావేశంలో పార్టీ ప్రధఆన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసింది. పార్టీ అధికారాలన్నీ కూడా మార్గదర్శక కమిటీకి బదలాయిస్తూ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేశారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలులో ఉన్నారు. శశికళతో పాటు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న టీటీవీ దినకరన్ ను కూడా పార్టీ నుంచి తొలగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శికి ఎప్పటికీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొనసాగుతారని పార్టీ సర్వసభ్య సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది

YOU MAY LIKE