ధోని స్థానం నాకు కావాలి

          టెస్టు క్రికెట్‌ నుంచి ధోనీ రిటైరవ్వడంతో ఆ స్థానంలో వికెట్‌ కీపర్‌గా సాహా సేవలందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సాహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి  2019లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని తన భార్య కోరినట్లు భారత టెస్టు క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా తెలిపాడు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సాహా మాట్లాడుతూ ‘నా భార్య 2019లో జరగబోయే ప్రపంచకప్‌లో ఆడాల్సిందిగా కోరింది. ఆమె కోరిక తీర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదే’ అని సాహా చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై ధోని అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది వన్డేలాడిన సాహా ఒక్క అర్ధశతకం కూడా చేయలేదు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 16. ఇలాంటి బ్యాట్స్‌మెన్‌ ధోనీ స్థానంలో రావాలనుకోవడం హాస్యాస్పదం అని అభిమానులు మండిపడుతున్నారు.2019లో పాల్గొనే భారత జట్టుపై వచ్చే ఆరు నెలల్లో స్పష్టత వస్తుందని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపాడు.

YOU MAY LIKE